- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అక్కడ గట్టిపోటీ..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
కోలీవుడ్‌లో అజిత్, త్రిష జంటగా నటిస్తున్న ‘విదాముయర్చి’ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్‌కు అక్కడ పోటీ లేదని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే, కోలివుడ్ స్టార్స్ సినిమాలు లేకపోవడంతో ఏకంగా ఆరు సినిమాలు తమిళంలో సంక్రాంతికి వస్తుండటం గమనార్హం. అందులో ‘వనంగన్’, ‘కాదలిక్కు నేరమిల్లై’, ‘టెన్ అవర్స్’, ‘పదవి తలైవన్’, ‘మద్రాస్ కారన్’, ‘తరుణం’, ‘సుమో’ వంటి తదితర సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి సంక్రాతి పండగ బరిలో గేమ్ ఛేంజర్ చిత్రానికి గట్టి పోటీనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.