- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan: ఒకేసారి 3 సినిమాల అప్డేట్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్‌కు పండగే
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. తొలిసారిగా పవన్ కల్యాన్ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత ఏఎమ్ రత్నం(AM Ratnam) దీనిని నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా.. తొలిసారి హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను పవన్ కల్యాణ్ అభిమానులతో పంచుకున్నారు. సోమవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.
తాను ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు. ‘తాను ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ అంతా OG OG అని అరుస్తున్నారు. వాళ్ల అరుపులు నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. నేను అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగా యూజ్ చేసుకోవడం లేదు. హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ ఇంకా 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది ఉంది. అతి త్వరలో ఆ కొంత కూడా పూర్తి చేస్తాం’ అని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. కాగా, హరీష్ శంకర్ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్‌తో OG, క్రిష్ జాగర్లమూడితో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాల నుంచి విడుదలైన టీజర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.