Arjun Kapoor: నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా.. అర్జున్ కపూర్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
Arjun Kapoor: నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా.. అర్జున్ కపూర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor), నిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే అర్జున్ పుట్టాక అతని తల్లి మరణించడంతో బోనీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్(Janvi Kapoor), ఖుషీ కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ అర్జున్ కపూర్‌తో అంతా కలిసే ఉంటారు. జాన్వీ అంటే తనకు చాలా ఇష్టం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. తన చెల్లేళ్లతో కలిసి తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేస్తారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన పెళ్లి చేసుకుని ఓ బిడ్డ కూడా ఉన్న 51 ఏళ్ల మలైకా అరోరాతో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కొద్ది రోజులు వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు.

కానీ ఏమైందో తెలియనప్పటికీ మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. అయినప్పటికీ ఇటీవల మలైకా అరోరా(Malaika Arora) తండ్రి చనిపోవడంతో అర్జున్ కపూర్ ఆమె ఇంటికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆమె మాత్రం మాట్లాడలేదు. ఇక ఆయన మాత్రం తన సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టి వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే అర్జున్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘సింగం అగైన్’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘మేరే హస్బెండ్ బీవీ’ సినిమాతో రాబోతున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫడ్నేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్స్‌లో రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

తన తల్లి పుట్టినరోజు కావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘జన్మదిన శుభాకాంక్షలు అమ్మ... నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉండవచ్చు. నా గురించి గర్వపడుతున్నారని ఆశిస్తున్నాను. నా దగ్గర పదాలు కూడా అయిపోయాయి. నేను ఇకపై మీతో ఏమీ చెప్పలేనని నేను ద్వేషిస్తున్నాను కాని ఒక రోజు మనం మళ్లీ కలుద్దాం. మళ్లీ కౌగిలించుకుంటాము, మాట్లాడతాము, అప్పటి వరకు నవ్వుతూ ఉండండి మమ్మల్ని చూస్తూ ఉండండి. చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను’2 అని రాసుకొచ్చారు. అలాగే కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను కూడా జత చేశాడు.

Next Story