Aishwarya Rajesh: ఆయన డ్యాన్స్‌కు అభిమాని అయిపోయా.. స్టార్ హీరోపై ఐశ్యర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
Aishwarya Rajesh: ఆయన డ్యాన్స్‌కు అభిమాని అయిపోయా.. స్టార్ హీరోపై ఐశ్యర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర(Sri Venkateswara) బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని హైప్ క్రియేష్ చేశాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఐశ్వర్య రాజేష్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇందులో భాగంగా.. ఆమె ఎన్టీఆర్‌(NTR)పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే నేను చాలా సంతోషపడతాను. స్టూడెంట్ నం 1 నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను. ఎన్టీఆర్ చేసే డాన్స్‌కు, డైలాగ్ డెలివరీకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed