- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అవి కెరీర్‌కి ఉపయోగ పడాతాయంటే నేను నమ్మను.. రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి మంచి టాక్ అందుకుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఛావా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మక మందన్న నేషనల్ క్రష్(National Crush) ట్యాగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘ట్యాగ్స్ కెరీర్‌కు ఉపయోగపడతాయంటే నేను నమ్మను.. కొంత మంది అభిమానులు ప్రేమగా ఇలాంటివి ఇస్తుంటారు. ఏది ఏమైనా అవి కేవలం ట్యాగ్స్ మాత్రమే. మనం నటించే చిత్రాలు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే టికెట్ సేల్స్ పై ప్రభావం చూపిస్తాయి. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను, 24 చిత్రాల్లో నటించాను.
నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా నేషనల్ క్రష్ రీసెంట్‌గా పుష్ప-2 మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘థామా’(Thama), ‘వీడీ-14’(VD-14), ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend), ‘సికిందర్’(Sikindar), ‘కుబేర’(Kubera) వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సీక్రెట్ రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.