Anushka Shetty: వెయిట్ చేయలేకపోతున్నానంటూ అనుష్క శెట్టి పోస్ట్.. దేని గురించంటే?

by Hamsa |
Anushka Shetty: వెయిట్ చేయలేకపోతున్నానంటూ అనుష్క శెట్టి  పోస్ట్.. దేని గురించంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కానీ ‘బాహుబలి-2’(Baahubali-2) తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇక 2023లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) మూవీలో నటించింది.

ఆ తర్వాత ఒక ఏడాది పాటు ఖాళీగా ఉన్న ఆమె ప్రస్తుతం ‘ఘాటి’(Ghati) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్(UV Creations), ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి(Rajeev Reddy) నిర్మిస్తున్నారు. అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ‘ఘాటి’ ఏప్రిల్ 18న థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇప్పటికే ఇందులోంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్క శెట్టి ‘ఘాటి’ గ్లింప్స్, రిలీజ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘‘వెయిట్ చేయలేకపోతున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్లు స్వీటీ 2025లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని చెప్తూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story