ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి బిగ్ అప్డేట్.. త్వరలో!!

by Anjali |   ( Updated:2024-10-08 06:17:52.0  )
ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త..  ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి బిగ్ అప్డేట్.. త్వరలో!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చేసింది. తాజాగా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలా దేవి కీలక ప్రకటన చేశారు. తాజాగా ఈమె ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం పూర్తయ్యాక, శ్యామలా దేవి మీడియాతో ముచ్చటించారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్‌నిచ్చే విషయాన్ని చెప్పారు. ఈ న్యూస్‌తో రెబల్ స్టార్ అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు. మరీ ప్రభాస్ పెద్దమ్మ మీడియాతో ఏం చెప్పారు అంటే..? మన హీరో పెళ్లిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి? అందులో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అని ప్రశ్న ఎదురవ్వగా.. శ్యామలా దేవి స్పందించి.. ‘అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నటువంటి రోజు త్వరలోనే ఉంది.

ఆ అమ్మవారి ఆశీస్సులు.. అలాగే కృష్ణం రాజు దీవెనలు ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయి. త్వరలోనే తప్పకుండా వివాహం అవుతుంది. అప్పుడు మీడియా వారిని కూడా పిలుస్తాం’ అని శ్యామలా దేవి చెప్పుకొచ్చింది. ఇక పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ కుదురుగా ఉండే ముచ్చటా ఇది. కాగా సోషల్ మీడియాలో రెబల్ స్టార్ పెళ్లి ఖాయమైందంటూ మరీ మా వదిన ఎవరో అని తెగ ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే పనిలో పడ్డారు. చివరగా తెరకెక్కిన ప్రభాస్ ‘సలార్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోవడంతో ఈ హీరోకు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తతం రెబల్ స్టార్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Next Story