‘HIT: The 3rd Case’ నుంచి స్పెషల్ పోస్టర్.. రగ్గడ్ గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన నాని

by Hamsa |
‘HIT: The 3rd Case’ నుంచి స్పెషల్ పోస్టర్.. రగ్గడ్ గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani) హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘HIT: The 3rd Case’. శైలేష్ కొలను (Sailesh Kolanu)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని(Prasanthi Thipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది.

అయితే మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, రిపబ్లిక్ సందర్భంగా చిత్రబృందం ‘HIT: The 3rd Case’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌(Special poster)ను షేర్ చేశారు. ఇందులో నాని నిటారుగా నిలబడి భారత జెండాకు సెల్యూట్ చేస్తూ, చేతిలో తుపాకీ పట్టుకుని, సైనిక సిబ్బంది పక్కన ఉన్నట్లు కనిపిస్తుంది. అతని రగ్గడ్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇది సినిమాలోని యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్‌ను సూచిస్తుంది. ఈ పోస్టర్ రిపబ్లిక్ డే స్ఫూర్తికి తగిన ట్రిబ్యూట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story