Prabhas : హాయ్ డార్లింగ్స్.. రేపు బిగ్ సర్‌ప్రైజ్ ఉంది అంటూ వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్

by sudharani |
Prabhas : హాయ్ డార్లింగ్స్.. రేపు బిగ్ సర్‌ప్రైజ్ ఉంది అంటూ వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ఫౌజీ’ (Fauji) ఒకటి. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఇందులో డార్లింగ్ సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి (Imanvi) హీరోయిన్‌గా నటిస్తుంది. 1974 బ్యాక్ డ్రాప్ ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ప్రజెంట్ ఈ పీరియాడిక్ యాక్షన్ (Periodic action) డ్రామా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

కానీ, సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు తప్పా ఇప్పటి వరకు ఫౌజీ నుంచి ఒక్క అప్‌డేట్ (Update) కూడా ఇవ్వలేదు మేకర్స్. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహం (disappointment) వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ (Good news) చెప్పాడు ప్రభాస్. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? రేపు మీకు ఒక సర్‌ప్రైజ్ ఉంది. దాని కోసం నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడిండి’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed