బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు శోభిత రియాక్షన్ ఇదే(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-03-13 09:52:08.0  )
బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు శోభిత రియాక్షన్ ఇదే(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్(KL Rahul), బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి(Athiya Shetty) కొంత కాలం పాటు డేటింగ్‌లో ఉండి 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అతియా ప్రగ్నెంట్‌గా ఉంది. ఇక వచ్చే నెలలో ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారు. అయితే పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని స్వయంగా ఈ జంట సోషల్ మీడియా(Social Media) వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతియా శెట్టి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అయితే తన భర్త కేఎల్ రాహుల్ తన ఒడిలో పడుకొని ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నాడు. అలాగే మరికొన్ని అతనితో ఉన్న క్యూట్ మూమెంట్స్‌ను షేర్ చేసింది. ఇక వాటికి ‘హో బేబీ’(Oh Baby) అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక వాటిని చూసిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ(Anushka Sharma), బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ(Kiara Advani), సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), అనన్య పాండే(Ananya Pandey), ఇషా గుప్తా(Esha Gupta), క్రికెటర్ గిల్(Gill), అక్కినేని కోడలు శోభిత ధూళిపాల(Shobitha Dhulipala) కంగ్రాట్స్ చెబుతూ ఫొటోస్ చాలా క్యూట్‌గా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.




Read More..

హ్యాపీ యానివర్సరీ అంటూ పెళ్లి ఫొటో షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. మీ జంటను చూస్తే కుళ్లుగా ఉందంటున్న నెటిజన్లు

Next Story