engagement photos: సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన రామ్ చరణ్ ప్రియురాలు.. న్యూ బిగినింగ్ అంటూ పోస్ట్

by sudharani |
engagement photos: సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన రామ్ చరణ్ ప్రియురాలు.. న్యూ బిగినింగ్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: హీరోయిన్ షాజన్ పదంసీ (Shajan Padamsi) అంటే ఎవరూ గుర్తపట్టకపోవచ్చు.. కానీ రూబా అనగానే యూత్ అందరికి కనెక్ట్ అవుతుంది ఈ బ్యూటీ. అంతలా రామ్ చరణ్ (Ram Chara) ‘ఆరెంజ్’ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఆరెంజ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఇందులో రామ్ చరణ్ ప్రియురాలు రూబా (Ruba)గా మొదటి చిత్రంతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళం చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘మసాలా’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిచింది. అయితే.. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తెలుగులో అంతగా రాణించలేకపోయింది.

ఇదిలా ఉంటే.. గతేడాది హిందీలో ‘పగల్పన్’ సినిమాతో ఆడియన్స్‌ను అలరించిన ఈ అమ్మడు.. తాజాగా ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన ప్రియుడు ఆశిష్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని కనిపించింది. ఆశిష్ ఓ వ్యాపారవేత్త. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా ఎంగేజ్‌మెంట్‌తో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘జనవరి 20-2025 కొత్తగా ప్రారంభించాను’ అనే క్యాప్షన్ ఇచ్చి ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed