మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకుందా.. ?

by Hamsa |   ( Updated:2023-06-20 15:28:31.0  )
మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకుందా.. ?
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ . ఏ ముహూర్తాన ఈ మూవీ అనౌన్స్ చేశారో కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో టీమ్‌కే క్లారిటీ లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే పక్కకు తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ షూటింగ్ కోసం పూజా హెగ్డేకు సంబంధించి 60 రోజుల డేట్స్ తీసుకున్నారు. కానీ ఒక్క రోజు కూడా ఆమె షూటింగ్‌లో పాల్గొనలేదట. ఇక ఆమెకిచ్చిన డేట్స్ కూడా అయిపోయాయి. దీంతో పూజా ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయినట్లేనని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ పూజా హెగ్డే సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకోలేదని చెబుతున్నారు.

Also Read..

పూజా హెగ్డేతో త్రివిక్రమ్‌ బ్రేకప్.. సంయుక్త మీనన్ కారణమా?.. అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా?

మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్

Advertisement

Next Story

Most Viewed