పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరి హర వీరమల్లు నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్

by D.Reddy |   ( Updated:2025-01-27 14:42:30.0  )
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హరి హర వీరమల్లు నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాను క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక తాజాగా మేకర్స్ సోమవారం ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీలో విలన్‌గా నటిస్తోన్న బాబీ డియోల్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన పాత్రకు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బాబీ చూడ‌గానే ఆక‌ట్టుకునేలా క‌త్తిప‌ట్టుకుని గంభీరంగా క‌నిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక, రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడే ఓ యోధుడుగా కనిపించనున్నారు. 2025 మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా, ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే ప‌వ‌ర్‌స్టార్‌ స్వయంగా పాడిన 'మాట వినాలి' అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేయగా మంచి ప్రేక్షకదరణ పొందింది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు.


Click Here For Tweet..

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed