- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫ్యాన్స్‌కు శుభవార్త.. అక్కినేని ఇంటికి కొత్త కోడలుగా రాబోతున్న ఆ హీరోయిన్..! సమంతకు కూడా తెలియడంతో
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్తున్నారు. అయితే అక్కినేని ఇంట్లో మాత్రం ఎలాంటి శుభకార్యం జరగకపోవడంతో ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక అందరిలాగా రెండో పెళ్లి చేసుకుంటాడని అంతా భావించారు. కానీ ఆయన పెళ్లి ఊసే ఎత్తకుండా ఫోసక్ కెరీర్‌పై పెట్టి హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అక్కినేని అఖిల్‌కు నిశ్చితార్థం అయి పెళ్లి క్యాన్సల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అఖిల్ ఏజెంట్ భారీ ఫ్లాప్ కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
ఇక ఆయన నటించిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని హీరోల పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, అఖిల్ వెంట ఓ హీరోయిన్ పడుతోందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆమె ప్రపోజ్ చేయడంతో అఖిల్ కూడా ఒప్పుకున్నాడట. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నాగచైతన్య మాజీ భార్య సమంతకు కూడా తెలియడంతో అఖిల్‌కు సపోర్ట్‌గా ఉందట.
అయితే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న హీరోయిన్ మరెవరలో కాదు అఖిల్‌తో కలిసి ఓ సినిమా చేసిందట. ఆ మూవీ పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ అందులోని సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి అఖిల్‌ను ప్రేమిస్తుందట. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు ఈ మధ్యనే ఆయనకు చెప్పినట్లు టాక్. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్త తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ ఆనందపడుతూ.. అన్ని సక్రమంగా జరిగితే ఆమె కచ్చితంగా అక్కినేని ఇంటికి కోడలు అవుతుందని అంటున్నారు.