- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Prabhas: " కన్నప్ప " లో వెంటనే " ప్రభాస్ విగ్ " మార్చాలంటూ లుక్ పై ఫుల్ ట్రోల్స్..!

దిశ, వెబ్ డెస్క్ : మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరక్కుతున్న సినిమా కన్నప్ప. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కన్నప్పలో ప్రభాస్ రుద్ర(Rudra)గా కనిపించనున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే, ప్రభాస్ లుక్ పై రక రకాల కామెంట్స్ చేస్తూ ట్రోలర్స్ ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర చిత్రంలో నాగార్జున(Nagarjuna) లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ అస్సలు సెట్ కాలేదని నెటిజన్స్ కూడా ఏకిపారేస్తున్నారు. " ఇలా అయితే మేము థియేటర్లలో మా డార్లింగ్ ను చూడలేము .. మీరు వెంటనే ప్రభాస్ విగ్ మార్చాలంటూ" మంచు విష్ణుకు సలహా ఇస్తున్నారు.
ఇటీవలే కన్నప్ప నుంచి రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, ప్రభాస్ పోస్టర్ పై ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అందమైన ముఖాన్ని ఇలా ఎలా చేశారంటూ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్, కాజల్ శివపార్వతుల గా కనిపించనున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్(AVA Entertainment Banner) పై మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.