- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sai Pallavi Cut Out : టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి.. తండేల్ హీరోయిన్ భారీ కటౌట్ మాములుగా లేదుగా..!

దిశ, వెబ్ డెస్క్ : నాగ చైతన్య, సాయి పల్లవి ( Sai Pallavi ) కలిసి నటించిన చిత్రం " తండేల్ " ( Thandel ) ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చందు మొండేటీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌పై నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. మీడియం రేంజ్ హీరో కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం చాలా అరుదు. శ్రీకాకుళంలో మత్య్సకారుల యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అయితే, టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ కి దక్కని గౌరవం సాయి పల్లవికి దక్కింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరోల కటౌట్ లు పెట్టడం సహజం. అయితే, ఇప్పటి వరకు మనం హీరోల కట్ అవుట్ మాత్రమే చూశాము. ఇప్పుడు తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి కట్ అవుట్ పెట్టడం విశేషం. 2024 జూన్ లో ఈ బ్యూటీ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళింది. అప్పటి నుంచి అక్కడి ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేసి ఫైనల్ గా వైజాగ్‌లోని సంగం థియేటర్ వద్ద సాయిపల్లవి భారీ కటౌట్ ను ( Sai Pallavi Cut Out ) పెట్టారు. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తొలిసారి. ఎందుకంటే, ఇలాంటి గౌరవం ఏ హీరోయిన్ కి దక్కలేదు. ఈ ముద్దుగుమ్మ ఏది చేసిన చాలా నేచురల్ గా ఉంటుంది.
ఈమె నటనని ఎలా అయితే ఇష్టపడతారో పల్లవి వేసే డ్యాన్స్ ని కూడా అంతే ఇష్ట పడతారు. తండేల్ సినిమాలో హైలెస్సా హైలెస్సా పాటలో నడుమ స్టెప్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది ఆ స్టెప్పును వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చివరికి ఆ సినిమాకి మ్యూజిక్ ను అందించిన దేవి శ్రీ ప్రసాద్ కూడా ఆ స్టెప్పు ను వేశారు.