- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘అమ్మాయిలా చీర కట్టుకుని ఆ పని చేయడంతో నాన్న తోలు ఊడిపోయేలా కొట్టాడు’.. టాలీవుడ్ విలన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నెగెటీవ్ రోల్‌లో మెప్పిస్తున్నాడు. అలాగే మరో పక్క రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నాడు. రవి కిషన్ తెలుగుతో పాటు హిందీ, భోజ్‌పురీ భాషల్లో కూడా నటించాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి కిషన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా ఊరిలో రామ్‌లీలా అనే నాటకం వేసేవారు. నేను అందులో సీతలా నటించే వాడిని. ఒక రోజు మా నాన్నకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను అమ్మ చీర తీసుకెళ్లి దానితో రోజంతా రిహార్సల్ చేశాను. ఇంటికి వెళ్లగానే మా నాన్న బెల్ట్ అందుకుని వాయించాడు. నా చర్మం ఊడిపోయేలా కొట్టాడు. మా ఊరిలో మా నాన్నకు మంచి పేరుంది.
తనను అందరూ ఎంతో గౌరవించేవారు. బహుశా అందుకేనేమో నేనిలా అమ్మాయిలా వేషం కట్టి యాక్ట్ చేస్తుంటే భరించలేక పోయారు. అయితే ఆ కోపంతో నాన్న నన్నెక్కడ చంపేస్తాడోనని అమ్మ భయపడిపోయింది. అదే రోజు రాత్రి నా చేతిలో రూ.500 పెట్టి పారిపోమని చెప్పింది. అలా 15 ఏళ్ల వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి ముంబైకు వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.