- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ బస్సులో జాతిరత్నాలు బ్యూటీ.. ఆమెను అలా చూస్తే జనాలు ఊరుకుంటారా..?

దిశ, వెబ్‌డెస్క్ : ఫరియా అబ్దుల్లా.. పేరు చెబితే గుర్తు రాకపోవచ్చు కానీ జాతి రత్నాలు చిట్టి అంటే మాత్రం గుర్తుపట్టని వారు ఉండరు. జాతి రత్నాలు సినిమాలో పద్దతిగా అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులు దగ్గరైంది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రంలో కోర్టులో వాదిస్తూ సీరియస్ సీన్లను సైతం కామెడీగా చేసి కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచినా ఆ తరవాత మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. జాతి రత్నాలు తరవాత ఫరియా బంగార్రాజు, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, రావనాసుర, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలతో పాటూ గతేడాది మత్తువదలరా సినిమాలోనూ నటించింది.
కానీ ఈ సినిమాలలో ఒక్కటి కూడా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో చిట్టికి జాతిరత్నాలు తప్ప మరో సూపర్ హిట్ సినిమా లేకుండా పోయింది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఫరియా మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. సోషల్ మీడియా ద్వారానో టీవీ షోల ద్వారానో ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. అంతే కాకుండా ఎక్కడ కనిపించినా జాతిరత్నాలు సినిమాలో చేసినట్టుగా సందడి సందడిగానే కనిపిస్తుంటుంది.
ఇక సినిమాల్లో పద్దతైన పాత్రలే వచ్చినా గ్లామర్ డోస్ పెంచడంలోనూ ఈ అమ్మడు తక్కువేమీ కాదు. ఇన్ స్టా, ఫేస్ బక్ లలో గ్లామర్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా మరోసారి ఫరియా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను ఓ పాత బస్సులో దిగటం ఆసక్తికరం. ఫోటోలకు క్యాప్షన్ కూడా పాత బస్సును ఎలా వాడుకోవాలో తెలుసా? అని పెట్టింది. ఇక ఈ ఫోటోలలో తన అందాలను చూపిస్తూ పొడవాటి జెడ, మెడలో నెక్లెస్ తో అటు ట్రెడిషనల్, ఇటు వెస్ట్రన్ కలిపి కొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE ...
5PM Dynamic: వామ్మో ఇన్ని లక్షలా..? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో విష్ణుప్రియ ఇంత సంపాదించిందా?