- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ హీరోకు ఫ్యాన్స్ షాక్.. అలా వద్దంటూ..?

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా తమ అభిమాన హీరో వరుస సినిమాలు చేస్తుంటే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. కానీ తమిళ స్టార్ హీరో విషయంలో మాత్రం అతడి వరుస సినిమాలకు డిఫరెంట్‌గా రెస్పాన్స్ వస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తలైవా అజిత్. డైరెక్టర్‌తో పనిచేయడం నచ్చితే అతడికి స్టార్ హీరోలు అవకాశాలు ఎక్కువగానే ఇస్తారు. కానీ అజిత్ మాత్రం అలా కాదు. ఒక డైరెక్టర్ నచ్చితే వరుసగా అతడితోనే మూడు, నాలుగు సినిమాలు చేస్తాడు. ఇదే తరహాలో డైరెక్టర్ శివతో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం సినిమాలు వరుసగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్‌లో వినోద్‌తో సినిమాలు చేస్తున్నాడు.
'నెర్కొండ పార్వై' సినిమాతో ఈ కాంబో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా రెండో సినిమా 'వలిమై' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాను ఈ కాంబో ఓకే చేసింది. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. దీంతో అజిత్ ఒకే డైరెక్టర్‌తో వరుస సినిమాలు చేయడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుస సినిమాలు బాగానే ఉన్నా ఒకే డైరెక్టర్ అంటే కొత్తదనం ఉండటం లేదంటున్నారు. మరి ఈ విషయంలో అజిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.