- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dulquer Salmaan: పవన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సినిమా.. జర్నీ స్టార్ట్ అయిందంటూ మేకర్స్ ట్వీట్

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ మూవీ 2023లో విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక అదే ఫామ్‌తో దుల్కర్ గత ఏడాది ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar)మూవీతో హిట్ సాధించారు. ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే దుల్కర్ సల్మాన్ ఓ తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
దీనిని పవన్ సాధినేని(Pawan Sadhineni) తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై స్వప్న దత్(Swapna Dutt), సందీప్ గున్నం, రమ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara)అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గత ఏడాది ప్రకటించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి క్యూరియాసిటీ పెంచారు.
కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ విడుదల చేయకపోవడంతో ఆగిపోయిందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇందులో చీఫ్ గెస్టులుగా అల్లు అరవింద్, అశ్వనీ దత్‌లు పాల్గొన్నారు. ఈ పోస్ట్‌కు ‘ఆకాశంలో ఒక తార’ జర్నీ స్టార్ట్’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.