తల్లిదండ్రులకు తెలియకుండా తమన్నా బాత్‌రూమ్‌లో అలాంటి పని చేస్తుందా? బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని మరీ

by Hamsa |   ( Updated:2023-10-02 05:27:12.0  )
తల్లిదండ్రులకు తెలియకుండా తమన్నా బాత్‌రూమ్‌లో అలాంటి పని చేస్తుందా? బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకుని మరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో హద్దులు చెరిపేసి మీతిమీరి నటిస్తోంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల బెడ్ రూమ్‌ సీన్స్‌తో రెచ్చిపోయి అందరికీ షాకిచ్చింది. అంతేకాకుండా తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపింది.

తాజాగా, తమన్నాకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందని అది కూడా ఆమె తన తల్లిదండ్రులకు తెలియకుండా బాత్‌రూమ్‌లో చేస్తుందని ఓ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది. తమన్నాకు స్మోకింగ్ పిచ్చ ఉందట. స్మోక్ చేయకపోతే ఆమెకు నిద్ర పట్టదట. అంతేకాదు ఇంట్లో ఉన్నప్పుడు స్మోక్ చేస్తే తన తల్లిదండ్రులకు తెలిసిపోతుందేమో అని బాత్రూంలోకి వెళ్లి మరి స్మోక్ చేస్తుందట . కొన్నిసార్లు విజయ్ వర్మ కూడా ఆమెకు హెల్ప్ చేశాడట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన కొందరు ఆరోగ్యం పాడైపోతుందని సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story