Allu Aravind కంటే ముందే వరుణ్-లావణ్య ఎఫైర్ బయటపెట్టింది ఎవరో తెలుసా?

by Anjali |   ( Updated:2023-06-15 13:21:58.0  )
Allu Aravind కంటే ముందే వరుణ్-లావణ్య ఎఫైర్ బయటపెట్టింది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి నిశ్చితార్థం సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరి ప్రేమ గురించి అల్లు అరవింద్ ముందే ఊహించి ఎప్పుడో హింట్ ఇచ్చాడని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే లావణ్య మెగా కోడలు కాబోతుందనే విషయం ముందుగానే ఒక సినిమా ద్వారా తెలియజేసిందంటూ వీడియో వైరల్‌ అవుతుంది.

ఈ హీరోయిన్ నటించిన మొదటి చిత్రం ‘‘అందాల రాక్షసి’’లో ఒక సన్నివేశంలో భాగంగా లావణ్య తన పెళ్లికి చిరంజీవి వస్తాడు అంటూ కామెంట్ చేశారు. ఇందులో లావణ్య పెళ్లి జరగబోతుండగా కొందరు పిల్లలు వచ్చి నీ పెళ్ళికి చిరంజీవి వస్తాడంట కదా అని అడిగారు. ఇలా పిల్లలు అడగడంతో ఆమె కూడా తన వివాహానికి మెగాస్టార్ వస్తాడని చెప్పింది. ఆ రోజు సినిమాలో చెప్పిన విధంగానే ఇప్పుడు లావణ్య పెళ్లికి చిరంజీవి రావడమే కాకుండా మెగా ఇంటికే కోడలు వెళ్తుంది. లావణ్య నటించిన ఈ మూవీలోని డైలాగ్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read..

ఉపాసన ప్రెగ్నెన్సీ ఫేక్..! ఇన్ని నెలలకు బయటపడ్డ అసలు నిజం..?

Advertisement

Next Story