- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆ మూవీ కారణంగా సినిమాలు ఆపేద్దామనుకున్నా’.. డైరెక్టర్ సుకుమార్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి(జనవరి 14న రిలీజ్ డేట్) ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృదం ప్రస్తుతం ప్రమోషన్ల జోరులో ఉంది. ఇందులో భాగంగా తాజాగా గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘మహేష్ బాబు నటించిన ‘1- నేనొక్కడినే’ మూవీ ఫలితంతో సినిమాలు ఆపేద్దామని అనుకున్నాను. యూఎస్(US)లో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడిని. యూస్ ఆడియన్స్ వల్లే నేను ఇలా ఉన్నాను’ అంటూ వారికి థాంక్స్ చెప్పారు సుకుమార్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ సినిమా తర్వాత సుకుమార్ తీసిన ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పుష్ప-2’ ఎంతగా విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.