Prithviraj Sukumaran: జాగ్రత్త పడండి.. విలన్ వచ్చేస్తున్నాడు.. ఇంట్రెస్టింగ్‌గా స్టార్ డైరెక్టర్ పోస్ట్

by sudharani |   ( Updated:2025-03-15 18:11:24.0  )
Prithviraj Sukumaran: జాగ్రత్త పడండి.. విలన్ వచ్చేస్తున్నాడు.. ఇంట్రెస్టింగ్‌గా స్టార్ డైరెక్టర్ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ (Malayalam) మెగా స్టార్ మోహ‌న్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఎల్-2: ఎంపురాన్’ (L-2: Empuran). బ్లాక్ బ‌స్టర్ చిత్రం లుసిఫ‌ర్ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తుండగా.. టోవినో థామస్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 27న మలయాళంతో పాటు తమిళం (Tamil), తెలుగు (Telugu), కన్నడ (Kannada), హిందీ (Hindi) భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. అయితే.. లైకా ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడినట్లు కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియా(Social media)లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీంతో ‘ఎల్-2’ వాయిదా వార్తలపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. ‘ఇది కరెక్ట్ టైమ్.. అందరూ జాగ్రత్త పడింది. మీ కోసం విలన్ వచ్చేస్తున్నాడు.. తాను రెడీగా లేడని ఒప్పించడానికి విలన్ ట్రై చేస్తున్నాడు. అది అతని గొప్ప ట్రిక్’ అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే ఈ సినిమా నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. ‘ఎల్-2 రిలీజ్‌పై ఎలాంటి సందేహం వద్దు. ముందు చెప్పినట్టే సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మెగాస్టార్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

Raashi Khanna: బాలీవుడ్ సినిమాలే ముద్దు.. తెలుగు వద్దు అన్నట్టుగా నార్త్‌లో దూసుకుపోతున్ బ్యూటీ

Next Story

Most Viewed