Chandoo Mondeti: నా పేరు మార్చుకుంటా అంటూ.. సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ చందూ మొండేటి

by Prasanna |
Chandoo Mondeti: నా పేరు మార్చుకుంటా అంటూ..  సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ చందూ మొండేటి
X

దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటిస్తున్న సినిమా ‘తండేల్’ ( Thandel ). చందూమొండేటి ( Chandoo Mondeti ) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందింది. ఇందులో చైతూకి జంటగా సాయి పల్లవి ( Sai Pallavi ) కథానాయికగా చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే తాజాగా దర్శకుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచనల కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ.. " తండేల్ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలని లవర్స్ కు అనిపించకపోతే తన పేరు మార్చుకుంటానని అని గట్టిగా చెప్పాడు. అయితే ఇది హిట్ అవుతుందా లేక కమర్షియల్ హిట్ అవుతుందా అనే దాని గురించి తాను ఇలా మాట్లాడం లేదని అతను చెప్పాడు. అంతేకాకుండా, ప్రేమికుల్లో చాలా మంది బుజ్జి తల్లులు చాలా మంది రాజులు ఉన్నారని అన్నాడు. వాళ్లు ఈ మూవీని ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడటమే కాకుండా నాలుగు జంటలను కూడా తమతో పాటు తీసుకెళ్తారని పేర్కొన్నాడు. అలా ఆ లవర్స్ అనుకోకపోతే తన పేరు మార్చుకుంటానని " పేర్కొన్నాడు. దీంతో, చందూ మొండేటి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

చాలా మంది నెటిజన్లు డైరెక్టర్ చందూ మొండేటి ( Chandoo Mondeti ) కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి మాటలు అవసరమా బ్రో .. సినిమా హిట్ అయ్యాక ఎన్ని అయిన మాట్లాడు అందరూ వింటారు .. ముందే ఇలా మాట్లాడి తర్వాత రిజల్ట్ బెడిసి కొడితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. ఈ మూవీ విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story

Most Viewed