‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ఇక్కడ ఉన్నది కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలకృష్ణ తాండవం చూపించేశారుగా

by Kavitha |
‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ఇక్కడ ఉన్నది కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలకృష్ణ తాండవం చూపించేశారుగా
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, మూడు పాటలు మూవీ పై భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్(Trailer) లాంచ్ ఈవెంట్‌ని నేడు అమెరికా(America)లోని డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ ట్రైలర్‌ను గమనించిట్లయితే .. ‘అనగనగా ఓ రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఇతన్ని డాకు అనేవాళ్ళు, కానీ మాకు మాత్రం మహారాజు’ అంటూ చిన్న పిల్లవాడి వాయిస్‌తో స్టార్ట్ అయినా ఈ ట్రైలర్‌లో బాలయ్య డబల్ రోల్ అని, ఒకటి ప్రస్తుతం జరిగే కథ, మరోటి పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తుంది. అలాగే చిన్న పాప ఎమోషన్‌తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ‘అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు’ అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ అదుర్స్. ఫైనల్‌గా ఈ ట్రైలర్‌లో బాలయ్య తాండవాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.

Advertisement

Next Story

Most Viewed