Dabidi Dibidi: టాప్ ట్రెండింగ్‌లో ‘దబిడి దిబిడి’.. ఎన్ని వ్యూస్ అంటే?

by sudharani |
Dabidi Dibidi: టాప్ ట్రెండింగ్‌లో ‘దబిడి దిబిడి’.. ఎన్ని వ్యూస్ అంటే?
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘దబిడి దిబిడి’ (Dabidi Dibidi) సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాటను తమన్, వాగ్దేవి ఆలపించగా.. ఇందులో బాలకృష్ణతో నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా.. ఎప్పటి నుంచో మాస్ బీట్ కోసం ఎదురు చూస్తు్న్న నందమూరి ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చింది. దీంతో.. భారీ వ్యూస్‌తో దూసుకుపోతూ ప్రజెంట్ సోషల్ మీడియా (Social media)లో ట్రెండింగ్ వన్‌ (Trending one)గా నిలిచింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘‘దబిడి దిబిడి’ సాంగ్ ఫ్యాన్స్‌తో పాటు అందరిని కట్టిపడేసింది. దీంతో యూట్యూబ్‌లో 3 మిలియన్స్ ప్లెస్ వ్యూస్ సొంతం చేసుకుంటూ ట్రెండింగ్ టాప్‌లో దూసుకుపోతుంది’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story