Pottel: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘పొట్టేల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by sudharani |   ( Updated:2024-12-04 16:26:39.0  )
Pottel: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘పొట్టేల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna) లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి (Sahit Mothkhuri) తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పాజిటివ్ అంచనాల మధ్య అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పొట్టేల్’ యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ బాగుందంటూ ఆడియెన్స్ (audience) నుంచి ప్రశంస‌లు అందుకుంది.

అంతే కాకుండా కలెక్షన్ల విషయంలో కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ (Digital Streaming)కు సంబంధించిన ఓ వార్త ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ (OTT) హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), ఆహా (aha) సొంతం చేసుకున్నట్లు తెలుస్తుండగా.. ఈ చిత్రాన్ని డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వనున్నట్లు టాక్.

Read More...

Ajay Devgn: రిలీజ్‌కు సిద్ధమైన స్టార్ హీరో సీక్వెల్.. పోస్టర్ వైరల్


Advertisement

Next Story

Most Viewed