Naga Chaithanya : క్రెడిట్ గోస్ టు మై వైఫ్ : నాగ చైతన్య

by M.Rajitha |   ( Updated:2025-02-04 13:26:31.0  )
Naga Chaithanya : క్రెడిట్ గోస్ టు మై వైఫ్ : నాగ చైతన్య
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ శోభిత-నాగచైతన్య(Shobhitha - Naga Chaithanya) వివాహం జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా వారి పెళ్లి గురించి ఏదోక హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది. తాజాగా వారి వివాహం గురించి చైతన్య మరోసారి మీడియాతో పంచుకున్నారు. నాగ చైతన్య కొత్త సినిమా "తండేల్"(Thandel) విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఈ మూవీ ప్రమోషన్స్ లో చైతు బిజీ బిజీగా ఉన్నాడు. కాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితతో తన పెళ్లినాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. తమ ఇరువురి పెళ్లి ప్లానింగ్ అంతా శోభితదే అని ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. చూడటానికి మోడర్న్ గర్ల్ లాగా కనిపించినప్పటికీ శోభితకు తెలుగు నేటివిటీ అనే చాలా ఇష్టం. మన సంస్కృతి, సంప్రదాయాలను బాగా పాటిస్తుంది. మా వెడ్డింగ్ సమయంలో నేను షూట్ పనుల్లో బిజిగా ఉన్నప్పటికీ.. అన్ని బాధ్యతలు తానే తీసుకొని, తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా డిజైన్ చేసింది అని అన్నాడు. ఈ విషయంలో క్రెడిట్ అంతా శోభితకే ఇస్తానని చైతూ కొనియాడారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపిన ఆ క్షణాలను ఎప్పటికీ తనకు పదిలమే అని, తన జీవితంలో చాలా విలువైన క్షణాలవి అని భావోద్వేగానికి గురయ్యారు.

ఇక ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న "తండేల్" సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా చాలా సహజంగా ఉంటుందని, ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని అన్నారు. అద్భుతమైన ప్రేమకథ.. పెయిన్ తో కూడిన ప్రేమ ఉంటుందని వివరించారు. గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్ పై బన్నీ వాసు(Bunni Vasu) నిర్మాణంలో చందూ మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్(DSP) సంగీతం అందిస్తున్నాడు.

Read Also..

డోస్ పెంచిన మెగా బ్యూటీ.. ఆ పార్ట్ చూపిస్తూ హీట్ పుట్టిస్తున్న హీరోయిన్

Next Story

Most Viewed