‘ఛావా’పై వివాదాస్పద కామెంట్స్.. నా ఉద్దేశం అది కాదంటూ క్షమాపణలు చెప్తూ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |
‘ఛావా’పై వివాదాస్పద కామెంట్స్.. నా ఉద్దేశం అది కాదంటూ క్షమాపణలు చెప్తూ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్(Dinesh Vijan) నిర్మించారు. అయితే ‘ఛావా’ చిత్రాన్ని శివాజీ సావంత్ మరాఠీ నవల ఆధారంగా తెరకెక్కించగా.. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

సినీ ప్రియులతో పాటు ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్(Swara Bhaskar) మాత్రం ఛావాపై వివాదాస్పద పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ విమర్శలు చేసింది. అంతేకాకుండా దీనిని 500 ఏళ్ల క్రితం తెరకెక్కించిన కల్పిత కథ అని ట్వీట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, స్వర భాస్కర్ దీనిపై స్పందిస్తూ క్షమాపణలు కోరింది. ‘‘నా ట్వీట్ చాలా చర్చను, తప్పించుకోదగిన అపార్థాన్ని సృష్టించింది. ఎటువంటి సందేహం లేకుండా నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య వారసత్వాన్ని, సహకారాన్ని గౌరవిస్తాను. ముఖ్యంగా సామాజిక న్యాయం , మహిళల పట్ల గౌరవం గురించి ఆయన ఆలోచనలు బాగుంటాయి.

నా పరిమిత విషయం ఏమిటంటే, మన చరిత్రను కీర్తించడం చాలా గొప్పది, అయితే దయచేసి ప్రస్తుత కాలంలోని తప్పులు, వైఫల్యాలను దాచడానికి గత వైభవాన్ని దుర్వినియోగం చేయవద్దు. చారిత్రక అవగాహన ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించాలి. ప్రస్తుత సమస్యల నుండి దృష్టిని విభజించడానికి, మళ్లించడానికి కాదు. నా ఇంతకు ముందు చేసిన ట్వీట్ ఏదైనా మనోభావాలను దెబ్బతీసి ఉంటే చింతిస్తున్నా క్షమాపణలు కోరుతున్నాను. నా ఉద్దేశం అది కాదు. అయితే ఇతర గర్వించదగిన భారతీయులలాగే నేను కూడా మన చరిత్ర గురించి గర్విస్తున్నాను. మన చరిత్ర మనల్ని ఏకం చేయాలి, మరింత సమగ్రమైన భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని అందించాలి’’ అని రాసుకొచ్చింది.

Next Story

Most Viewed