Niharika Konidela Divorce : విడాకులపై చిరంజీవి ఏమన్నారంటే?

by Hamsa |   ( Updated:2023-07-07 03:08:05.0  )
Niharika Konidela Divorce : విడాకులపై చిరంజీవి ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నల గడ్డ 2020లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారని ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, వాటిపై ఇద్దరూ స్పందించ లేదు. విడాకుల కోసం కూకట్ పల్లీ ఫ్యామిలీ కోర్టులో 2023 ఏప్రిల్ 1న దరఖాస్తు చేసుకుని.. జూలై 5న వారు విడిపోతున్నట్లు సోషల్ వేదికగా ప్రకటించారు.

తాజాగా, వీరి విడాకులపై గతంలో చిరంజీవి పలు కామెంట్స్ చేసినట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. నిహారిక విడాకులు తీసుకోవాలని అనుకుంటుంది అని నాగబాబు చెప్పినప్పుడు చిరంజీవి తన ఇష్టం అంటూ చెప్పాడట. దానికి ముఖ్య కారణం శ్రీజ అని తెలుస్తోంది. ఇష్టం లేని వాళ్లతో ఎంత బలవంతం చేసి ఉంచినా ఉండరనే అలా చెప్పాడట. ఆ కారణంగానే మీ లైఫ్ మీ ఇష్టం అంటూ శ్రీజకు, నిహారికకు చెప్పి వాళ్ల సొంత డెసిషన్ తీసుకోమని చిరు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసిన వారు నిహారిక విడాకులు తీసుకోవడం చిరంజీవికి ఇష్టమేనని అందుకే ఈ విషయం ఇన్నిరోజులు బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని నెటిజన్లు అనుకుంటున్నారు.

Read More: నిహారిక జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి జోస్యం

Advertisement

Next Story