- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించగా.. ఇందులో దివ్యా దత్తా(Divya Dutta), అక్షయ్ ఖన్నా, అషుతోషి రానా కీలక పాత్రలో నటించారు. అయితే ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.
అలాగే థియేటర్స్‌లో చూసిన చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ‘ఛావా’ సినీ ప్రియులను మెప్పించడంతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ కావాలని నెటిజన్లు డిమాండ్ చేయగా.. వారి కోరిక మేరకు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్చానర్‌పై తెలుగు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు.
అయితే ఈ అద్భుతమైన సినిమాను అందరి డిమాండ్ మేరకు మార్చి 7న రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో అంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఛావా’ అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ మార్చి 3వ తేదీన 10 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విక్కీ కౌశల్ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు. ఇందులో కోపంగా ఉన్న ఆయనశత్రువులపైకి భాణాలు విసురుతూ పవర్ లుక్‌లో కనిపించారు.
The mighty and bravest #Chhaava arrives tomorrow! His ROAR will be epic❤️🔥
— Geetha Arts (@GeethaArts) March 2, 2025
The grand spectacle #ChhaavaTeluguTrailer drops Tomorrow at 10AM⚔️💥#ChhaavaTelugu grand release on March 7th by #GeethaArtsDistributions ❤️#ChhaavaInCinemas #ChhaavaRoars@vickykaushal09 @iamRashmika… pic.twitter.com/ZnXiGQgG9I