- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాకీర్ హుస్సేన్ మృతిపై దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ తబలా విద్వాంసకుడు జాకీర్ హుస్సేన్ (73) ఆదివారం రాత్రి గుండెసంబంధిత వ్యాదితో కన్నుమూశారు. కాగా ఆయన మరణ వార్తను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అనంతరం భారత్ లోని ప్రముఖులు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాకీర్ హుస్సేన్ మృతిపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్పందించి.. నివాళులు ఆర్పించారు. తన ట్వీట్‌లో "ప్రపంచం ఎప్పటికీ భర్తీ చేయలేని లయను కోల్పోయింది" అని పోస్ట్ చేశారు. “ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, అతని తబలా బీట్‌లు భారతదేశ ఆత్మలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి, అతని అసమానమైన కళారూపాన్ని వదిలేశారు. అతని వారసత్వం ఒక శాశ్వతమైన 'తాల్', ఇది రాబోయే తరాలకు ప్రతిధ్వనిస్తుంది. RIP,” గౌతమ్ అదానీ అని రాసుకొచ్చారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ
హుస్సేన్ మృతిపై ట్విట్టర్ ద్వారా.. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ..“గొప్ప తబలా ప్లేయర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ జీ మరణవార్త చాలా బాధాకరం. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ జీ తన కళ వారసత్వాన్ని మిగిల్చాడు. అది మన జ్ఞాపకాలలో సజీవంగా ఉంటుంది.
కేంద్ర మంత్రి, జ్యోతిరాదిత్య ఎం. సింధియా
“జాకీర్ హుస్సేన్ జీ యొక్క తబలా లోని బోల్స్ (గాత్రం) సరిహద్దులు, సంస్కృతులు, తరాలను దాటి సార్వత్రిక భాష మాట్లాడింది. ఈ క్లిప్ మనం అతనిని ఎలా గుర్తుంచుకుంటామో.. అతని వారసత్వాన్ని ఎలా జరుపుకుంటామో ఖచ్చితంగా వివరిస్తుంది. అతని లయ యొక్క ధ్వని, కంపనాలు మన హృదయాలలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి. ఆయన కుటుంబానికి, అభిమానులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.” అని రాసుకొచ్చారు.