Evening walking: ఈవెనింగ్ వాకింగ్‌తో ఏయే సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!!

by Anjali |
Evening walking: ఈవెనింగ్ వాకింగ్‌తో ఏయే సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: వాకింగ్(walking) ఆరోగ్యానికి మేలని తరచూ వైద్యులు చెబుతూనే ఉంటారు. వాకింగ్ వల్ల కేవలం బాడీ ఫిట్‌(Body fit)గా ఉండటమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు చెక్ పెట్టొచ్చు. చాలా మంది మార్నింగ్(Morning) అండ్ ఈవెనింగ్ వాకింగ్(Evening walking) చేస్తుంటారు. అయితే ఉదయం పూట కన్నా సాయంత్రం వాకింగ్ చేస్తే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈవెనిగ్ వాకింగ్ చేస్తే నిద్రలేమి(Insomnia), ఒత్తిడి(stress) వంటి సమస్యలు దూరమవుతాయి. వాకింగ్ మంచి నిద్రకు దారితీస్తుంది. అలసట అనేది పోతుంది. చాలా రోజులుగా ఒత్తిడితో బాధపడుతోన్న వారు... రెగ్యులర్‌గా కనుక సాయంత్రం పూట నడిస్తే స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కండరాలు రిలాక్స్‌(Relax muscles)గా ఉంటాయి. బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా జరుగుతుంది. బరువు(Weight control) అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈవెనింగ్ వాకింగ్‌తో మానసిక ప్రశాంతత దక్కుతుంది. వాకింగ్‌తోపాటు ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం(exercise) కూడా చేయండని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఉన్న రోగాలన్నీ పరార్ అవుతాయి.. కొత్తగా దరిచేరవు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed