రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలి : ఆదిలాబాద్ కలెక్టర్

by Aamani |
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించాలి : ఆదిలాబాద్  కలెక్టర్
X

దిశ, ఆదిలాబాద్ : గ్రామ,మండల స్థాయి క్రీడల్లో రాణించి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లోను రాణించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రం లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా లెవెల్ సీఎం కప్ 2024 క్రీడలను సోమవారం నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైనా జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ఆయన ప్రారంభించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో సీఎం కప్ 2024 క్రీడలను విజయవంతంగా పూర్తి చేసుకొని, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలియజేశారు.

జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో ఈనెల 27 నుంచి వచ్చే జనవరి 2వ తేదీ వరకు నిర్వహించే క్రీడల్లో పాల్గొని, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని కోరారు.కాగా ఆరు రోజుల పాటు తేదీ:16 నుండి 21 వరకు జిల్లా స్థాయిలో వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతాయని,కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, బాడ్మింటన్ బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, చెస్, బాక్సింగ్, స్విమ్మింగ్ లతో పాటు మరికొన్ని రకాల క్రీడలు ఉంటాయని తెలిపారు.ఇందులో భాగంగా టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇందులో డి వై ఎస్ ఓ వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ అధారిటీ ఆఫీసర్ పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed