Telangana Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-16 09:53:22.0  )
Telangana Assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)ల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ(Telangana Assembly)లో ఆయన మాట్లారు. స్పీకర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. టూరిజం పాలసీపై సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) చర్చను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లగచర్ల ఘటనపై చర్చ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో సభకు స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. మరో ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed