Karthik Aryan:‘అక్కడ ఎదగాలంటే టాలెంట్ ఒక్కటుంటే సరిపోదు’.. అగ్ర నటుడు సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
Karthik Aryan:‘అక్కడ ఎదగాలంటే టాలెంట్ ఒక్కటుంటే సరిపోదు’.. అగ్ర నటుడు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఒంటరిగానే పోరాడుతున్నానని.. ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదని తెలిపారు. భారీ విజయం సొంతం చేసుకున్నప్పటికీ.. సినీ పరిశ్రమలో ఎలాంటి మద్ధతు లేదని అన్నారు. తను ఒంటరి యోధుడునని.. ఇల్లు కూడా తన స్వంతంగా సంపాదించుకున్న మనీతోనే కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది విడుదలైన భూల్ భూలయ్య త్రీ(Bhul Bhulaya) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని.. కానీ దాని వెనక ఎవరూ రారనే నిజాన్ని అర్థం చేసుకున్నానని వెల్లడించారు. దీంతో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. స్వంతంగా ఎదగాలని ఫిక్స్ అయ్యానని పేర్కొన్నారు. ఈ సినీ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నానని.. టాలెంట్ ఒక్కటుంటే సరిపోదని అన్నారు. అలాగే తన కెరీర్‌లో చాలా మందిని మీట్ అయ్యానని చెప్పుకొచ్చారు. కానీ పెద్దలను మాత్రం కలిసే చాన్స్ రాలేదని.. వారికి నేను తెలియాలి అనే కోరిక కూడా పెద్దగా లేదని వివరించారు. కేవలం సినీ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనపై ఉంటే చాలన్నారు. నెటిజన్ల మద్దతు ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed