పెళ్లైనా ఓకే అంటూ స్టేజి మీదే నానికి హగ్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

by Kavitha |   ( Updated:2024-08-23 14:41:47.0  )
పెళ్లైనా ఓకే అంటూ స్టేజి మీదే నానికి హగ్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గేమ్‌ షో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’. ఈ షో జూన్ 29 నుంచి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. ఖిలాడీ భామలుగా బుల్లితెర బ్యూటీలు, కిర్రాక్ బాయ్స్‌గా సీరియల్ యాక్టర్లు రెండు జట్లుగా ఏర్పడి పోటీపడుతున్నారు. అందాల నటి అనసూయ ఈ ఖిలాడీ బ్యూటీస్ లీడర్‌గా వ్యవహరిస్తుండగా, కిర్రాక్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ లీడర్గా కొనసాగుతున్నారు. ఇక హాట్ యాంకర్ రాములమ్మ అలియాస్ శ్రీముఖి యాంకర్‌గా కొనసాగుతుంది. అయితే ఈ షో తొలి ప్రోమోతోనే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రోమోలో భాగంగా అనసూయ తన టాప్ విప్పగా, శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పడం అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పలువురు ఈ షో పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. కానీ, ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇదిలా ఉంటే.. ఈ శని, ఆదివారాలతో షోకు ఎండ్ కార్డు పడనుంది. తాజాగా ఈ షోకు సంబంధించి గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల అయ్యింది. శేఖర్ మాస్టర్ దుమ్మురేపే డాన్స్, అనసూయ అంద చందాలు, శ్రీముఖి చలాకి మాటలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. రెండు టీమ్‌లు చేసిన సందడి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో అలరిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్ పోటాపోటీ డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. అయితే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్’ గ్రాండ్ ఫినాలే షోకు చీఫ్ గెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. ‘దసరా’ సినిమాలోని పాటకు మాస్ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ లేడీ కస్టెంటెంట్, తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, అయేషా జీనత్ స్టేజి మీదికి వచ్చి నానిని హగ్ చేసుకుంది. దీంతో శ్రీముఖి “ఆయనకు పెళ్లైంది” అని చెప్పగా.. “ఇట్స్ ఓకే పర్లేదు అండీ” అంటుంది. నాని కూడా “అయితే, నాకు ఇట్స్ ఓకే.. నాక్కూడా పర్లేదు” అని చెప్పడంతో షోలోని వాళ్లంతా ఫుల్‌గా నవ్వుతారు. కాగా ఈ షో పూర్తి ఎపిసోడ్ ఈ శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఇక ఈ గేమ్ షోలో గెలిచిన టీమ్‌కు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ నిర్వాహకులు ఇవ్వనున్నారు.

(video link credits to star maa youtube channel)

Advertisement

Next Story