బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘Bhola Shankar Movie’.. ఫైనల్‌గా ఎన్ని కోట్లు నష్టం అంటే..?

by sudharani |   ( Updated:2023-08-21 08:39:15.0  )
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘Bhola Shankar Movie’.. ఫైనల్‌గా ఎన్ని కోట్లు నష్టం అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, తమన్న, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. 2015 రిలీజై కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ మూవీకి రిమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు మెహర్ రమేషన్ దర్శకత్వం వహించారు. ఇక భారీ అంచనాల నడుమ ఆగస్టు-11న విడుదలైన ‘భోళా శంకర్’.. మొదటి షోలోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రేక్షకుల అంచనాలను సినిమా రీచ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచింది.

అయితే.. దాదాపుగా రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ కనీసం పావు వంతు కలెక్షన్లు కూడా సాధించలేకపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భోళా శంకర్ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 30 కోట్లు లోపే షేర్ వసూళ్లను అందుకుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఈ వసూళ్లను దృష్టిలో పెట్టుకుని.. మెగా స్టార్ ‘భోళా శంకర్’ మూవీకి రూ. 50 కోట్ల వరకు నష్టాలు ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more : రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా తమిళ్ స్టార్ హీరో..!

Advertisement

Next Story