Anushka Shetty : ఆ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. ప్రభాస్ ఏమైపోవాలంటున్న ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2024-01-28 05:49:29.0  )
Anushka Shetty : ఆ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. ప్రభాస్ ఏమైపోవాలంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రభాస్‌తో ‘బాహుబలి’ లో నటించి పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తించు సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి ప్రభాస్, అనుష్క రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిపై వీరిద్దరు స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. అయినప్పటికీ గత కొద్ది కాలంగా పుకార్లు ఆగడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఈమె పెళ్లిపై ఎన్నో వార్తలు వినిపించినా కూడా ఒక్కసారి కూడా ఈమె పెళ్లి వార్త నిజం కాలేదు. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించింది.

ఒకప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీని ఏలిన ఆమె ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్క ఓ క్రికెటర్‌తో పెళ్లికి సిద్దమైనట్లు ఇండస్ట్రీలో టాక్. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ క్రికెటర్ ని కలిసిన అనుష్క శెట్టి అప్పట్నుండి ఆయనతో ఫోన్లు మాట్లాడుతూ ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకొని ఇంట్లో వాళ్లకు తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసిందట. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో అసలు విషయం చెప్పిందని తెలుస్తోంది. ఈ విషయం చెప్పిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో ప్రభాస్ ఏమైపోవాలని అంటున్నారు.

Advertisement

Next Story