యంగ్ హీరో బిగికౌగిలిలో నలిగిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2025-02-10 04:44:00.0  )
యంగ్ హీరో బిగికౌగిలిలో నలిగిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతితో ‘డ్రాగన్’(Dragon), ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.

అలా ఓ పక్క వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో, వ్యక్తిగత విషయాలతో ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ అనుపమ నటిస్తున్న సినిమాల్లో ‘డ్రాగన్’ ఒకటి. తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీనిని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్(Kalpathi S.Aghoram), కల్పాతి ఎస్. గణేష్(Kalpathi S.Ganesh), కల్పాతి ఎస్. సురేష్(Kalpathi S.Suresh) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మిస్కిన్, కెఎస్ రవికుమార్(Ravi Kumar), విజె సిద్ధూ(VJ Sidhu), హర్షత్ ఖాన్, అవినాష్ పి వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ ఈ రోజు అనగా ఫిబ్రవరి 10న రాత్రి 7 గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరోయిన్‌ను హీరో గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక చుట్టూ ఉన్న అతని ఫ్రెండ్స్ (బాయ్స్) నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Next Story