Anupama Parameswaran: అనుపమ బర్త్‌డే స్పెషల్.. ‘పరదా’ నుంచి వీడియో రిలీజ్

by sudharani |
Anupama Parameswaran: అనుపమ బర్త్‌డే స్పెషల్.. ‘పరదా’ నుంచి వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘అ..ఆ..’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. శతమానం భవతి (Shatamanam Bhavati) సినిమాతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లుక్‌తో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా అభిమానులను తనవైపు తిప్పుకున్న అనుపమ.. టిల్లు స్క్వేర్‌ (Tillu Square)లో బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇక ఆ సినిమాలో అనుపమ యాక్టింగ్‌కు విమర్శలతో పాటు ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి. అప్పటి నుంచి వరుస సినిమాలతో సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘పరదా’ (Parada) మూవీతో బిజీగా ఉంది.

లేడీ ఓరియెంటెడ్ (Lady oriented) చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళీ (Malayali) హీరోయిన్ దర్శక రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇక నేడు అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే స్పెషల్‌గా పరదా నుంచి ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాలో తన పాత్రను సుబ్బుగా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో.. అనుపమ ఒక చెట్టు కింద ఉయ్యాలలో కూర్చుని మొఖం కనిపించకుండా పరదా వేసుకుని చేతిలో మైక్ పట్టుకుని.. ‘పరదాలమ్మా పరదాలు.. రంగు రంగుల పరదాలు.. డిజైన్ గల పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనౌన్స్ చేస్తుంది. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story