Anni Manchi Sakunamule OTT Release: :‘అన్నీ మంచి శకునములే’. ఎప్పుడంటే!

by Anjali |   ( Updated:2023-06-15 11:51:54.0  )
Anni Manchi Sakunamule OTT Release: :‘అన్నీ మంచి శకునములే’. ఎప్పుడంటే!
X

దిశ, సినిమా: నందిని రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మే18న థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. అలాగే తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోను ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

Also Read: Salaar :‘సలార్‌’ మూవీ యూనిట్‌కు ఊహించని కానుక ఇచ్చిన ప్రభాస్‌!

Advertisement

Next Story