- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anchor Vishnu Priya : హైకోర్టులో యాంకర్ విష్ణుప్రియ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

దిశ, వెబ్ డెస్క్ : యాంకర్ విష్ణుప్రియ(Anchor Vishnu Priya) హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ విష్ణుప్రియ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్.. విచారణను రేపటికి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting Apps Pramotion Case)సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రముఖ నటులు, యాంకర్స్, యూట్యూబ్ స్టార్స్ పై పోలీసులు కేసులు నమోదు చేసి, విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే టీవీ యాంకర్ విష్ణుప్రియపై పోలీసులు కేసులు నమోదు చేసి, పలుమార్లు విచారించారు. కాగా తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై మరో ఫిర్యాదు అందింది. సీసీపీఏకు అడ్వొకేట్ కృష్ణకాంత్ చేసిన ఈ ఫిర్యాదులో మూడేళ్లపాటు ఎలాంటి యాడ్స్ చేయకుండా సెలబ్రిటీలపై నిషేధం విధించాలని కోరాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు రూ.10 నుంచి 50 లక్షల వరకు జరిమానా విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.