Super Buzz.. రాంచరణ్‌తో జతకట్టిన అనసూయ.. బ్లాక్ బస్టర్ హిట్ లోడెడ్ అంటున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2025-02-09 11:28:08.0  )
Super Buzz.. రాంచరణ్‌తో జతకట్టిన అనసూయ.. బ్లాక్ బస్టర్ హిట్ లోడెడ్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ప్రజెంట్ బుచ్చి బాబు (Director Buchi Babu) డైరెక్షన్‌లో ‘RC16’ సినిమాలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధ సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు మున్నాభయ్యా(Munnabhayya), సీనియర్ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఊహించిన ఫలితం దక్కకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘RC16’ ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సూపర్ బజ్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో ‘రంగస్థలం’ కాంబో బ్యాక్ అని నెట్టింట పెద్ద టాక్ నటుస్తోంది. ‘RC16’లో అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) ఓ కీలక పాత్రలో నటిస్తుందట. ఇప్పటికే ఆమె ఈ సినిమాకు సైన్ చెయ్యగా.. ఈ విషయాన్ని చిత్ర బృందం గోప్యంగా ఉంచినట్లు టాక్. అంతే కాకుండా గత వారం, ప్రభాస్ శీనుతో పాటు అనసూయ అండ్ రామ్ చరణ్ నటించిన కొన్ని సన్నివేశాలను టీమ్ చిత్రీకరించిందని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్‌గా మారడంతో.. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘సూపర్ బజ్.. బ్లాక్ బస్టర్ హిట్ లోడెడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ క్యారెక్టర్ మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. చరణ్ అండ్ అనసూయ మధ్య వచ్చిన చాలా సన్నివేశాలు ఆ సినిమాకు హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Next Story