- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa 2 : ఎమోషనల్ క్యాప్షన్‌తో సుకుమార్ సతీమణి పోస్ట్.. దీంతోపాటుగా..!
దిశ, వెబ్‌డెస్క్: అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్ని తెరకెక్కించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పుష్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. ఈ డైరెక్టర్ మరింత క్రేజ్ దక్కించుకున్నారు. పుష్ప కు సీక్వెల్‌గా పుష్ప2 (Pushpa 2) తో డిసెంబరు 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తోన్న అల్లు అర్జున్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న (డిసెంబరు 2) హైదరాబాదు(Hyderabad)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కథానాయిక రష్మిక మందన్న(Rashmika Mandanna)తో పాటు చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఇకపోతే తాజాగా బ్లాక్ బస్టర్ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత(Tabitha) సోషల్ మీడియా వేదికన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
‘పుష్ప సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అండ్ సుక్కు, మూవీ టీమ్ ఎంతో కష్టాపడ్డారని.. పుష్ప మేకింగ్ గ్లింప్స్(Puṣpa making glimps) పంచుకుంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ మూవీ కేవలం ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు.. ఒక ఎమోషనల్ అని తెలిపింది. ఇంట్లో ఉండి కథ చదివే దగ్గర నుంచి ఇప్పుడు వేదికపై నిల్చుని అందరిచేత పొగడ్తలు అందుకునే వరకు మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా మీ టాలెంట్‌ను ఎంతోమంది గుర్తిస్తారని తెలిపింది. మీ సక్సెస్‌లో మీ పక్కన ఉన్నందుకు చాలా హ్యాపీగా, గర్వంగా అనిపిస్తుందని వెల్లడించింది. మీతో నా ప్రయాణం చాలా సంతోషానిస్తుందని’ సుకుమార్ సతీమణి పోస్ట్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.