విడుదలైన 14 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన అమలాపాల్ బోల్డ్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Kavitha |
విడుదలైన 14 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన అమలాపాల్ బోల్డ్ మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్స్‌లోకి వచ్చిన మూవీ 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటే ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి అంత సుముఖత చూపిస్తలేరు. దీనినే అదునుగా చేసుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా డిఫరెంట్ కంటెంట్‌‌ ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి మూవీనే విడుదలైన 14 సంవత్సరాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్(Amalapal) అందరికీ సుపరిచితమే. మలయాళం మూవీ నీల తామర(Neela Tamara)తో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఒక్కో ఇండస్ట్రీలో డెబ్యూ చేసుకుంటూ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలా తమిళంలో అమలాపాల్ నటించిన ఫస్ట్ మూవీ సింధు సామవేళి(Sindhu Samaveli). అయితే ఈ అమ్మడు అడుగు పెట్టడమే బోల్డ్ చిత్రంతో పెట్టింది. తమిళంలో రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 2010 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. దీనికి డైరెక్టర్ స్వామి(Director Swamy) దర్శకత్వం వహించారు. అయితే, సింధు సామవేళి సినిమా విడుదలయ్యాక విపరీతమైన వివాదాస్పదంగా మారింది. దాంతో అమలా పాల్‌పై నెగెటివిటీ రావడమే కాకుండా డైరెక్టర్ స్వామిపై పలు మహిళా సంఘాలు దేహశుద్ధి కూడా చేశారు. అంత కాంట్రవర్సీ తెచ్చిన సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు అప్పట్లోనే డబ్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 10న తెలుగులో విడుదల చేయాలనుకున్న అది కుదరలేదు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత నేరుగా యూట్యూబ్‌(You Tube) లో దర్శనం ఇచ్చింది. మూడు నెలల క్రితం నుంచి ఈ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రాన్ని నేటి చరిత్ర(Neti Charithra) అనే టైటిల్‌తో యూట్యూబ్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అమలా పాల్‌తోపాటు హీరో హరీష్ కళ్యాణ్(Harish Kalyan) (పార్కింగ్ మూవీ ఫేమ్) కూడా డెబ్యూ ఇచ్చాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో గజిని(Ghajini) నటించారు.

కథ విషయానికి వస్తే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్స్ మిలిటెంట్ అయిన తండ్రి కోడలితో నిర్వహించిన అక్రమ సంబంధం కథాంశంతో నేటి చరిత్ర సాగుతుంది. కాన్సెప్ట్‌ మాత్రమే కాకుండా రొమాంటిక్ సీన్లతో నేటి చరిత్రను బోల్డ్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ స్వామి. అప్పట్లో తీవ్ర కాంట్రవర్సీగా మారి ఇప్పుడు తెలుగులోకి వచ్చిన ఈ సినిమాను చూడాలంటే యూట్యూబ్‌లో వెళ్లి చూసేయండి.

Next Story

Most Viewed