Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలో అల్లు అర్జున్ ? వైరల్ అవుతున్న వీడియో

by Prasanna |   ( Updated:2024-12-03 16:32:22.0  )
Venkatesh:  ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాటలో అల్లు అర్జున్ ? వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ ( Venkatesh) హీరోగా నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam ). అనిల్ రావిపూడి ( Anil Ravipudi) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 14న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

భాస్కరభట్ల లిరిక్స్ రాయగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ను అందించాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ర‌మ‌ణ గోగుల, తెలంగాణ ఫోక్ సింగ‌ర్ మ‌ధుప్రియ క‌లిసి ఈ సాంగ్ ను అద్భుతంగ పాడారు. ఈ పాట‌లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లు ఒకర్ని మించి ఒకరు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. అయితే, ఈ పాటలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదే లే అనే డైలాగ్ వాడటంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. " తగ్గేదే లేదంటూ నా కొంగేనుకే పడుతుంటారు.. " అంటూ .. భాస్కరభట్ల రాసిన ఈ లిరిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More...

ALLU Family: థియేటర్ వద్ద ఆకట్టుకుంటోన్న అల్లు ఫ్యామిలీ కటౌట్.. రామ‌లింగ‌య్య నుంచి అయాన్ వ‌ర‌కు!


Advertisement

Next Story

Most Viewed