Allu Arjun: మైనర్ పై జానీ మాస్టర్‌ అత్యాచారం.. బాధితురాలికి అండగా నిలిచిన ఐకాన్ స్టార్(ట్వీట్)

by Kavitha |
Allu Arjun: మైనర్ పై జానీ మాస్టర్‌ అత్యాచారం.. బాధితురాలికి అండగా నిలిచిన ఐకాన్ స్టార్(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నార్సంగీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట దుమ్ము దుమారం రేపుతోంది. ఇక జానీ మాస్టర్ లాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో బాధితురాలికి అండగా ఓ ప్రముఖ హీరో ఉన్నట్లు పలు పుకార్లు నెట్టింట షికార్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వివరాల్లోకి వెళితే..

Movies4u Official అనే ట్వీట్ ప్రకారం.. "గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన రాబోయే అన్ని సినిమాలకు పని అందిస్తానని జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అల్లు అర్జున్ హామీ ఇచ్చారు" అంటూ ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

Read More...

Johnny Master: పరారీలో జానీ మాస్టర్‌..! ఆచూకీ కోసం నార్సింగి పోలీసుల స్కెచ్



(video link credit to Movies4u Official X account)


Advertisement

Next Story

Most Viewed