- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allu Arjun: అల్లు అర్జున్ ఆ సమస్యతో బాధ పడుతున్నాడు .. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటిస్తున్న సినిమా ‘తండేల్’ ( Thandel ). చందూమొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇందులో చైతూకి జంటగా సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలయ్యి గ్లింప్స్, టీజర్, పాటలకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నట్లు అనౌన్స్ చేయగా.. బన్నీ మాత్రం హాజరు కాలేదు. దీంతో, దీని గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై అల్లు అర్జున్ (Allu Arjun ) తండ్రి అల్లు అరవింద్ ( Allu Aravind ) రియాక్ట్ అయ్యారు. అతని కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.
అల్లు అర్జున్ (Allu Arjun ) గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కారణంగా ఈ ఈవెంట్ కు రాలేకపోయారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ఆరోగ్యానికి సంబంధించి ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది. ఆయన ఇంటి వద్ద కాలుజారి కిందపడడంతో కాలు బెనికిందని.. అందుకే, ఈ కార్యక్రమానికి వెళ్ళలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్షన్ చేశారు. గీతా ఆర్ట్స్ పతాకం పై రూ. 72 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మొదటి సినిమా ఇదే. ఇందులో నాగచైతన్య తండేల్ రాజు పాత్ర పోషించగా.. సాయి పల్లవి బుజ్జితల్లి పాత్రలో నటించింది.